సాధారణంగా చాలామంది వీధి వ్యాపారులు, కొంతమంది టిఫిన్ సెంటర్ల వాళ్లు, అమ్మే ఆహారాలను న్యూస్ పేపర్లలో పెట్టి వినియోగదారులకు అందిస్తుంటారు. ఆ న్యూస్ పేపర్లలో ఉంచిన ఆహారాలను తినటం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందని, వ్యాపారులు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని FSSAI హెచ్చరికలు జారీ చేసింది. ఆహార పదార్థాలను ప్యాకింగ్, స్టోరేజి చేయడానికి, వడ్డించడానికి న్యూస్ పేపర్లను వాడటం ఆపాలని ఆదేశాలు ఇచ్చింది.