మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ సోదరి ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ శనివారం కురుపాం కోటలో ఆయన్ను పరామర్శించారు. ఆయనతో పాటు పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి విజయచంద్ర, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తమ సంఘీబావం తెలిపారు. సీనియర్ నాయకులు గుంట్రెడ్డి రవికుమార్, సిరిపురపు భాస్కర్ రావు, కోలా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.