అనంతపురం జిల్లా, ఉరవకొండ పట్టణంలో ఘరానా చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... స్థానిక వీరశైవనగర్లో నివాసముంటున్న వేరుశనగ వ్యాపారి గోపాల్‌రెడ్డి అర్ధరాత్రి వేరుశనగల లారీ లోడ్ రావడంతో అనలోడ్ చేయించడానికి భార్య ఇంట్లో నిద్రిస్తుండగా బయట తాళం వేసి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తాళాలు పగులగొట్టి, గదిలోని రూ.10లక్షలను అపహరించుకు వెళ్లారు. గోపాల్‌రెడ్డి పనిముగించుకుని తెల్లవారుజామున ఇంటికి రాగా గదిలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ విషయాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీం ను పిలిపించి ఆధారాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.