అనంతపురం జిల్లా, గుంతకల్లు, కసాపురం రోడ్డులోని మారుతీ నగర్‌లోని ఓపెన ప్లాట్స్‌లో ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ, కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టణానికి చెందిన పీ ధనుంజయ, బళ్లారికి చెందిన వై చత్రయ్య, వజ్రకరూరు మండలం గూళ్లపాళ్యంకు చెందిన ఏ రామాంజనేయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి రూ. 4.72లక్షలు, కర్ణాటకకు చెందిన 96 టెట్రాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa