వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకుని పట్ల కక్షపూరితంగా.. వెటకారంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ.... జైలులో ఉన్న చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతుంటే దానిపైనా వైసీపీ నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యం బాగోలేని చంద్రబాబును ఆస్పత్రికి వెళ్లనీయకుండా చేయటం బుద్ధిలేని చర్య. బరువు పెరిగారంటూ వ్యగ్యంగా మాట్లాడటం దారుణం. చంద్రబాబుకు వయసును బట్టి ఆరోగ్య సమస్యలు రావడం సహజమంటూ డాక్టర్ల వద్దకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకుండా చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పట్ల టీడీపీ శ్రేణుల్లో ఆందోళన ఉందని అన్నారు.