పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ చేసిన మోసం బయటపడింది. వివరాల్లోకి వెళ్ళితే... మండలంలోని లక్ష్మణేశ్వరానికి చెందిన స్వామి గ్రూప్ సభ్యులకు రుణం తీసుకోకుండానే ‘బంధన్’లో రూ.1.10 లక్షలు రుణం ఇచ్చినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో వారు బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదించారు. విచారించగా చాలా మందికి రుణాలు ఇవ్వకుండానే బ్యాంకు మేనేజర్ సుమారు రూ.25.65 లక్షలు ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇదే తరహాలో గతంలో విజయా బ్యాంకులో కూడా పెద్ద కుంభకోణం వెలుగుచూసింది. యలమం చిలి మండలానికి చెందిన రైతుల పేరిట లక్షలాది రూపా యలు రుణాలు కాజేశారు. నోటీసులు అందిన తరువాత ఈ భాగోతం బయటపడింది. ఇటీవల మొగల్తూరు మండ లానికి చెందిన కొంత మంది రైతులు గణపవరంలోని జాతీయ బ్యాంకులో రుణాలు తీసుకున్నట్లు నోటీసులు వచ్చాయి. దీంతో వీరంతా పోలీసులకు ఫిర్యాదు చేయడం తో సీబీసీఐడి విచారణ చేపట్టింది. ఇంకా ఈ కేసు ఒక కొలిక్కిరాలేదు. ఈ తరుణంలో మరో బ్యాంకులో ఖాతాదా రుల పేరిట ఇంటి దొంగే రుణాలు స్వాహా చేయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.