ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు సందర్భంగా ఘాట్ రోడ్డు దిగువు నుంచి కొండపై అమ్మవారి సన్నిధానం వరకు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే ఘాట్ రోడ్డు పైకి అధికారులు అనుమతిస్తున్నారు. నిన్న 80 వేల మందికి పైగా దుర్గమ్మను భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యంగా వీఐపీల తాకిడితో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. అధికారుల తీరుపైన మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఇంద్రకీలాద్రిని పూర్తిగా పోలీసులు, రెవెన్యూ విభాగం ఆధీనంలోకి తీసుకుంది. ఘాట్ రోడ్డు పైకి టికెట్లు ఉన్న వారిని వృద్ధులను, వికలాంగులను మాత్రమే అనుమతిస్తున్నారు.