గాజా భూభాగాన్ని ఆక్రమించాలన్న ఆసక్తి గానీ, పాలస్తీనా పౌరుల్ని ఏలాలన్న తపన గానీ తమకు ఏమాత్రం లేవని ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ రాయబారి గిలాద్ ఎర్డాన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే, హమాస్ మిలిటెంట్ గ్రూపును సమూలంగా రూపుమాపేందుకు అవసరమైన చర్యల్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు. ఈ యుద్ధం తర్వాత గాజాను ఎవరు పాలించాలన్నదానిపై ఇప్పటికైతే తాము ఆలోచించడం లేదని తెలిపారు.