డిప్యూటి సీఎం నారాయణ స్వామి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబును చంపితే ఆయన భార్య నారా భువనేశ్వరే చంపాలని అన్నారు. తండ్రి చావుకు కారణమైన వ్యక్తినే పెళ్లి చేసుకున్న చరిత్ర భువనేశ్వరీదని విమర్శించారు. చంద్రబాబు జీవితాంతం జైళ్లో ఉన్నా.. స్పందన ఉండదన్నారు. ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న వాళ్లంతా పెత్తందారులేనని ఆయన ఉద్ధాటించారు.