ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో సోమవారం ఉదయం భూమీ స్వల్పంగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది. పితోర్‌ఘర్‌కు ఈశాన్యంగా 48 కి.మీ దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.