ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చంద్రబాబుపై నారా భువనేశ్వరి కక్ష తీర్చకుంటున్నారేమో'.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 06:12 PM

టీడీపీ అధినేత చంద్రబాబు, కుటుంబ సభ్యులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరస్థుడైన చంద్రబాబును అరెస్ట్ చేస్తే కులాల పేరుతో దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారని.. మద్యపాన నిషేధం గురించి వీరంతా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ మద్యాన్ని నిర్మూలించారని.. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారన్నారు. 1998లో మద్యపాన నిషేధాన్ని ఎత్తేసింది చంద్రబాబేనని.. అలా చేయకపోతే ప్రభుత్వం నడపలేమని చంద్రబాబు ప్రకటించారన్నారు. టీడీపీ హయాంలో గుడి, బడి అని చూడకుండా 4378 ప్రైవేట్ లిక్కర్ షాపులు, 43వేల బెల్‌ షాప్‌లు పెట్టారన్నారు. ప్రెసిడెంట్ మెడల్, డీలక్స్ విస్కీ, గవర్నర్ విస్కీ, బూమ్ బూమ్ బీర్ 2017లో చంద్రబాబు పాలనలో అనుమతి ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలోనే.. ఆ పార్టీ నేతలైన యనమల రామకృష్ణుడు బంధువులు,అయ్యన్న పాత్రుడు, డీకే ఆదికేశవులు నాయుడు, నంద్యాల ఎస్పీవై రెడ్డిలకు చెందినవారి కంపెనీలకు అనుమతి ఇచ్చారన్నారు.


ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి.. మరిది చంద్రబాబును కాపాడుకునే తపన కనిపిస్తోందన్నారు. ఆమెకు ఎన్టీఆర్ కూతురని చెప్పుకునే అర్హత లేదన్నారు. 2014 నుంచి ఎక్సైజ్‌ శాఖపై సీబీఐ విచారణకు తాము సిద్ధమని.. తాము ఎప్పుడు భయపడేది లేదన్నారు. అసలు పురందేశ్వరి ఏ పార్టీనో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే.. ఈమె చంద్రబాబు ను వెనకేసుకు వస్తున్నారని ధ్వజమెత్తారు.


చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని వారు అంటున్నారని.. తాను న్యాయసమ్మతమైన అరెస్ట్ అంటున్నానన్నారు. ఒకప్పుడు రెండు ఎకరాల భూమి ఉన్న చంద్రబాబుకు.. ఇప్పుడు రూ.లక్షలు కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. భువనేశ్వరినే అన్నంలో ఏదైనా కలిపి చంద్రబాబును చంపే ప్రయత్నం చేస్తుందేమో అని అనుమానం ఉందన్నారు. తన తండ్రిని ఎన్టీఆర్ పదవి నుంచి దించి, పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటుదేమో అనే అనుమానం కూడా ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు పదవీ కాంక్ష పట్టుకుందన్నారు నారాయణస్వామి. కొడుకు కోసం భువనేశ్వరి ఏమైనా చేస్తున్నారేమోనని.. చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదని చెప్పడానికి భువనేశ్వరి ఏమైనా డాక్టరా అంటూ ప్రశ్నించారు. తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న చరిత్ర భువనేశ్వరిదని ఆరోపించారు. ఎన్టీఆర్ బొమ్మ లేకుండా గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. ఒకవేళ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తాను అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa