గోడలకు మేకులు కొట్టవద్దు, గీతలు పడొద్దు అంటూ ఇంటి ఓనర్లు పెట్టే డిమాండ్లు విదేశాల్లోనూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలో చెక్క ఫోర్పై చిన్న గీత పడగా, వెయ్యి ఆస్ట్రేలియా డాలర్లు (రూ.52,890) చెల్లించాలని ఓనర్ డిమాండ్ చేశాడు. అద్దెకు ఉన్న వ్యక్తి ఈ విషయాన్ని Redditలో పోస్టు చేస్తూ. 'కంటికి కనిపించని స్థాయిలో ఉన్న గీతకు ఇంత మొత్తం చెల్లించాలట. ఇందులో అర్థముందా?' అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.