ఎక్సైజ్ పాలసీ కేసులను ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మనీష్ సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్టిల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఆయనపై మోపిన అభియోగాలపై దిగువ కోర్టులో వాదనలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటూ సీబీఐ, ఈడీల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును ప్రశ్నించింది.