చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని విరూపాక్షి మారెమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజైనా మంగళవారం అమ్మవారిని గాయత్రీ దేవిగా పది రకాల పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పిండి దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.