కుందుర్పి మండలం మాయదార్లపల్లిలో వైసీపీ కార్యకర్త నరసింహమూర్తి రెండు రోజుల క్రితం టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడును అసభ్యంగా తిట్టాడు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ప్రతి చర్యగా అదే గ్రామంలో మంగళవారం ఉదయం మంత్రి ఉషాశ్రీ చరణ్ దిష్టి బొమ్మను స్థానిక టీడీపీ నాయకులు దగ్ధం చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.