ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజి పనులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులతో కలసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా సిబ్బందితో సమావేశమై పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా భవన నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.