రానున్న 10 రోజుల్లో ఉత్తరకోస్తాకు తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 19, 20 తేదీలకల్లా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల 22వ తేదీకల్లా వాయుగుండంగా తరువాత తీవ్ర వాయుగుండంగా బలపడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 25వ తేదీకల్లా ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా తీరాల దిశగా వచ్చి తుఫాన్‌గా మారుతుందని చెబుతున్నారు.