ఏలూరు జిల్లా దెందులూరులో దారుణం చోటు చేసుకుంది. బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాలంటీర్ శివ కుమార్ వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాలికపై పలుమార్లు అత్యాచారం తెలిసినట్లు బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.