అధికార దాహంతో చంద్రబాబు పై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా బాబు తో నేను కార్యక్రమంలో భాగంగా వారపు సంతలో , గ్రామంలో ఇంటిటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.