ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 4వేల మందికిపైగా మృతిచెందారు. గాజాలోని ఆస్పత్రిపై దాడితో ఇజ్రాయెల్ కు సంబంధం లేదని నిరూపించాలని రష్యా డిమాండ్ చేసింది. దాడికి సంబంధించి శాటిలైట్ ఇమేజెస్ సమర్పించాలని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. ఆస్పత్రిపై జరిగిన దాడిని రష్యా ఖండించింది. ఈ ఘటనలో 500 మంది ప్రాణాలు కోల్పోవడం అమానవీయ చర్యగా పేర్కొంది.