గాజాలోని అల్ అహ్లి ఆస్పత్రిపై రాకెట్ దాడి జరగడంపై నోబెల్ పురస్కార గ్రహీత మలాల యూసఫ్జాయ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం వేళ పాలస్తీనా ప్రజలకు సాయం చేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలకు తన వంతుగా రూ.2.5 కోట్లు విరాళం అందజేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్-పాలస్తీనాలో శాంతి నెలకొనాలని ఆమె కోరుకున్నారు.