ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం పామిడి మండలంలోని రామగిరి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. వీలైంత త్వరగా పరిష్కారం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.