పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని, విధిగా ఓటును వినియోగించుకోవాలని తాడిపత్రి తహసీల్దార్ ముని వేలు సూచించారు. పట్టణ పరిసరాల్లోని సీవీఆర్డీ కళాశాలలో బుధవారం ఓటు ప్రాధాన్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరరక్షణ ఓటుతోనే సాధ్యమని అన్నారు.