అనంతపురం జిల్లాలో పాడి రైతులకు 40 శాతం సబ్సిడీ కింద గడ్డి కోత యంత్రాలు పంపిణీ చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్రమణ్యం బుధవారం తెలిపారు. మిషన్ విలువ రూ. 33970 కాగా 40 శాతం సబ్సిడీ రూ. 13588 కాగా మిగిలిన రూ 20382 చెల్లించాల్సి ఉందని తెలిపారు. కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే జిల్లాలో 155 మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు.