కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు హైకోర్టు లో ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. శివకుమార్ ఆస్తులు ఆదాయానికి మించి ఎక్కువగా ఉన్నాయని, తన మీద సీబీఐ నమోదు చేసిన కేసును రద్దుచేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. 3 నెలల్లోపు విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయాలని సీబీఐ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.