విజయవాడ ఏసీబీ కోర్టులో మాజీ సీఎం చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ స్కాం కేసులో ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. రిమాండ్ గడువు నేటీతో ముగియనుండగా.. జైలు అధికారులు ఆయనను వర్చువల్‌గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. తన సెక్యూరిటీ విషయంలో కొన్ని అనుమానాలున్నా చంద్రబాబు కోర్టుకు తెలిపారు. ఏమైనా అనుమానాలుంటే రాతపర్వకంగా ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు.