టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుని ఖండిస్తూ పార్టీ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు జలదీక్షలు, నిరసన ప్రదర్శనలు, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు క్షేమంగా తిరిగి రావాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. విశాఖ పశ్చిమలో ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నేత భరత్ కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలంలో ఎమ్మెల్యే రవికుమార్ సైకిల్ యాత్ర చేశారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఎల్లమ్మ ఆలయంలో మాజీ మంత్రి పరిటాల సునీత, మహిళలు 365 దీపాలతో దిపోత్సవం నిర్వహించారు. ఏలూరు జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, వెంటనే విడుదల కావాలని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.