గుంటూరు జిల్లా సర్వజనాసుపత్రికి కొత్తగా ఏడు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనాపరమైన విషయాలను పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటర్ పోస్టును మంజూరు చేయడం గమనార్హం. కొత్తగా సివిల్ ఇంజినీరింగ్, విద్యుత్తు పనుల పర్యవేక్షణకు ఇంజినీర్లను కేటాయించారు. ఒప్పంద విధానంలో ఫెసిలిటీ మేనేజర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డాటా ఎనలిస్ట్ పోస్టులను చేశారు.