ప్రతిపక్ష నేత చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని మంత్రి బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. చంద్రబాబు అరెసై్టన బాధ ఆయన కుటుంబ సభ్యల్లో కనిపించడం లేదన్నారు. చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టే జైల్ నుంచి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారని మంత్రి ప్రశ్నించారు.