ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న వైయస్ఆర్సీపీ సామాజిక న్యాయ బస్సు యాత్రను అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.అనంతపురం జిల్లా కేంద్రంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాల్ నందు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ , జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర - వై.ఏ.పి.నీడ్స్ జగన్" కార్యక్రమం నిర్వహణపై మంత్రి పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు.