చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడు సార్లు ములాఖత్ పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం విచారణకు రాగా ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. ప్రతివాదులను చేర్చాలని సూచించగా.. ప్రతివాదుల పేర్లు చేరుస్తామని కోర్టుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు.