దేశంలో తొలిసారి ర్యాపిడ్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ర్యాపిడ్ ఎక్స్) పేరుతో ప్రారంభించిన ఈ రైళ్లకు ‘నమో భారత్’గా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది. శుక్రవారం ప్రధాని మోడీ ఢిల్లీ-ఘజియాబాద్, సాహిబాబాద్-దుహై డిపో మధ్య ఈ రైలు ప్రారంభమైంది. ఫహీదాబాద్ కారిడార్‌లో రైలు ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థుల ముచ్చటించారు.