మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నాని కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లే సమయంలో వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన కారులోనే కొడాలినానితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. చిన్ నప్రమాదం కావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు. ప్రమాదం అనంతరం అదే కారులోనే నాని గుడికి వెళ్లారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కొందరు కొడాలికి ఫోన్ చేసి ప్రమాదంపై అడిగి తెలుసుకున్నారు.. చిన్న ప్రమాదమే అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొడాల నాని మేనకోడలి వివాహం గురువారమే జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా పెళ్లి వేడుకను కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఇవాళ ఉదయం అమ్మవారి గుడికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.