దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి పెను ముప్పు వాటిల్లుతుందని పునరుద్ఘాటించిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఓటు హక్కును హరించేలా ఇప్పుడు కాషాయ పార్టీ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమేనని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, రాజ్యాంగాన్ని కాపాడితేనే భవిష్యత్తును కాపాడతామని, లోక్‌సభ ఎన్నికలు భావి తరం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయని అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ చేసిన ప్రకటనపై ఘాటుగా స్పందించిన అఖిలేష్ యాదవ్, ఎంపీల్లోని కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపి ఉన్నారని ఆరోపించారు.