నవంబర్ 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన 5వ అభ్యర్థుల జాబితాలో 92 పేర్లను ఈరోజు సాయంత్రం ప్రకటించింది. అధికార కాషాయ పార్టీ తన జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించింది. ఇప్పటి వరకు బీజేపీ 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నికల బరిలోకి దించింది. బీజేపీ జాబితాలో హోషంగాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ సీతాశరణ్ శర్మ పేరు ఉంది. మాజీ కేబినెట్ మంత్రి యశోధర రాజే సింధియాకు టికెట్ ఇవ్వలేదు. అనారోగ్య కారణాల రీత్యా తాను ఎన్నికల్లో పోటీ చేయనని కొద్దిరోజుల క్రితం ఆమె ప్రకటించారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే పరాస్ జైన్‌కు కూడా టికెట్ నిరాకరించారు.భోపాల్ నైరుతి నియోజకవర్గం నుండి బిజెపి భోపాల్ జిల్లా మాజీ అధ్యక్షుడు భగవాన్‌దాస్ సబ్నానీని సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు మాజీ క్యాబినెట్ మంత్రి పిసి శర్మపై బిజెపి నిలబెట్టింది.230 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 228 పేర్లను ప్రకటించింది.