అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్. బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ ని ఉమ్మడి అనంతపురం జిల్లా నూతన కురబ సంఘం అధ్యక్షులు తుప్పటి ఈశ్వరయ్య, జిల్లా కురుబ సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ కురుబలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కురుబలు వైసిపి పార్టీకి మద్దతు పలికి జగనన్న గెలుపుకు కృషి చేద్దామన్నారు.