టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 23న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలలో శ్రీవారి దర్శనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి, చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జురపు నాయుడు, అమ్మణ్ణమ్మల సమాదులకు నివాళిలర్పిస్తారు. 25న చంద్రగిరిలో జరిగే ‘నిజం గెలవాలి’ తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు.