ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి శనివారం ఫైర్ అయ్యారు. ధర్మవరంలోని పోతుకుంట రోడ్డు పెట్రోల్ బంకు దగ్గర జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డిపై నీ ప్రైవేట్ సైన్యంతో దాడి చేయించావన్నారు. నువ్వసలు మనిషివేనా? మగోడివే అయితే కార్యకర్తలతో ఎందుకు. మా లీడర్లతో పెట్టుకో. తేల్చుకుందాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ దాష్టీకానికి చాలా మంది చనిపోయారని ఆరోపించారు.