రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరగా బయటికి రావాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఆదివారం విజయవాడ కనకదుర్గమ్నను టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జయ నాగేశ్వర్ రెడ్డి , నాయకులు జీవీపీ నాయుడు, రొద్దం నరసింహులు, చిన్నప్పయ్య, పాల్గొన్నారు.