యెస్(YES) బ్యాంక్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2)లో రూ. 228.64 కోట్ల నికర లాభం వచ్చింది. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో ప్రకటించిన రూ.160.41 కోట్లతో పోలిస్తే ఇది 47 శాతం పెరిగింది. కానీ ఈ ఏడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ.347 కోట్లతో పోలిస్తే మాత్రం బ్యాంక్ ప్రాఫిట్ తగ్గింది. క్యూ2లో యెస్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.1,925 కోట్లుగా రికార్డయింది.