తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో స్వామివారు ఊరేగుతుండగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుడి వాహనసేవ కనులవిందుగా జరుగుతోంది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు భక్తులకు స్వామి దర్శనమివ్వనున్నారు.