ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది టీచర్లకు దాదాపు రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఎను 2024లో మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పటం దుర్మార్గమన్నారు.