వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం సాయంత్రం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు. దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన రాజశ్యామల అమ్మవారి అలంకరణకు పూజలు చేసారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.