భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను శనివారం పోలీసులు ఆటో పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆటోలో భీమిలి అంతా తిరిగి దొంగతనాలు, నేరాలు జరుగుతున్న సంఘటనలను వివరించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎవరి పై ఏ అనుమానం వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ సంప్రదించాలని కోరారు. పండుగ వేళ నేరాలు, దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa