మెర్సర్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్-2023లో భారత్‌కు 45వ స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్నిచ్చే పెన్షన్ వ్యవస్థలను (64 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే) అధ్యయనం చేసి మొత్తం 47 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు. కాగా, గతేడాది 44 దేశాలతో ఈ జాబితాను రూపొందించగా.. అందులో భారత్ 41వ స్థానంలో ఉంది.