పల్నాడు జిల్లా, గురజాల మండలం జంగమహేశ్వరం గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకి గురైనాడు. వివరాల్లోకి వెళ్ళితే.... గ్రామానికి చెందిన పరమేశ్వర రెడ్డికి - కూనిరెడ్డి కృష్ణారెడ్డికి గతంలో పాత గొడవలు ఉన్నాయి. ఊరు వదిలి హైదరాబాద్లో కూనిరెడ్డి కృష్ణారెడ్డి ఉంటున్నారు. దసరా పండగ సందర్భంగా స్వగ్రామం వచ్చిన కృష్ణారెడ్డిపై ప్రత్యర్దులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ పల్లపురాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.