బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర తుఫాన్ (హమూన్)గా మారింది. అయితే ఒడిశాకు దానివల్ల పెద్ద నష్టమేమీ లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా తీరానికి 200 కిలోమీటర్ల దూరం నుంచి బంగ్లాదేశ్ వైపు సాగుతూ మంగళవారం రాత్రికి బలహీనపడింది. బంగ్లాదేశ్‌లో తీరం దాటేసరికి హమూన్ బలహీన పడుతుందని అధికారులు తెలిపారు.