మంగళగిరి పరిధి చినకాకానికి చెందిన దేవిరెడ్డి విజయలక్ష్మి కి కాకుమాను మండలం కాండ్రుపాడుకు చెందిన దేవిరెడ్డి వెంకట అప్పారావు - కోటేశ్వరమ్మ కుమారుడు భాగ్యరాజుతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని నెలలుగా భర్త భాగ్యరాజు, అత్త, మామ, చినమామ మాణిక్యాలరావులు అధిక కట్నం తేవాలని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ మేరకు బాధితురాలు మంగళవారం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa