రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే తాజాగా ప్రకటించారు. తన కుమార్తె ప్రణీతి షిండే తన వారసురాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో షోలాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తారని చెప్పారు. జనవరి 2003 నుండి నవంబర్ 2004 వరకు మహారాష్ట్ర సీఎంగా, యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా, ఉమ్మడి ఏపీకి గవర్నర్గా సేవలు అందించారు.