విశాఖలో వాషింగ్‌మెషీన్లలో తరలిస్తున్న భారీ నగదును విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా NAD జంక్షన్ వద్ద అధికారులు పట్టుకున్నారు. వాషింగ్ మెషీన్లలో రూ.1.3 కోట్ల నగదును గుర్తించారు. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో హవాలా డబ్బుగా అనుమానించిన పోలీసులు కేసు నమోదు చేశారు.